పోతురాజుల విన్యాసాలు... హోరెత్తించే డప్పు చప్పుళ్ల మధ్య సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ఆర్ధరాత్రి వరకు వైభవంగా సాగాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఫలహారం బండ్ల ఊరేగింపులో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తల్లి బైలెల్లినాదో అంటూ... నృత్యాలతో ముందుకు సాగారు. ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగాయి. ఈ ఉదయం అవివాహిత యువతి రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపిస్తుంది. అనంతరం అమ్మవారి విగ్రహం ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి.
అర్ధరాత్రి వరకు ఘనంగా బోనాల ఉత్సవం - bonalu celbrations
ఉజ్జయిని మహంకాళి బోనాలు అర్ధరాత్రి వరకు ఘనంగా సాగాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ ఉదయం అవివాహిత యువతి భవిష్యవాణి వినిపిస్తుంది. అనంతరం అమ్మవారి విగ్రహం ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.
బోనాలు ఉత్సవం