Ugadi Special 2023: ఉగాది.. తెలుగు సంవత్సరాది. తెలుగు ప్రజలకు అత్యంత ఇష్టమైన పండగ. తీపి, కారం, చేదు, ఉప్పు, పులుపు, వగరు అనే షడ్రుచుల సమ్మేళనంతో కూడిన పచ్చడి మనకెంతో ప్రత్యేకం. జీవితంలో అన్ని రకాల కష్టాలు వస్తాయి. అన్నిటినీ సమానంగా ఎదుర్కోవాలనే సందేశమిస్తుంది. ఈ ఆరు రుచులను మన జీవితానికి అన్వయించుకుంటే చాలా బాగుంటుంది.
తీపి:ఇంట్లో ఏదైనా శుభ కార్యం జరిగినప్పడు తీయటి పదార్థాలు తప్పనిసరి. ఏదైనా మంచి జరిగినా, శుభవార్త విన్నా, ఏదైనా సాధించినా నోరు తీపి చేస్తారు. అచ్చం మనం కూడా ఆ తీపి పదార్థాల లాగే ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్లకు సంతోషం అనే తీయదనాన్ని పంచాలి. మన పనులు సైతం ఇతరులకు స్వీట్ నెస్ యాడ్ చేసేలా ఉండాలి.
కారం:తినే పదార్థాల్లో కారం ఎక్కువైతే అంతే సంగతులు. మొత్తం తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కారం ఎక్కువుందని తిండి మానేయలేం కదా.. మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఎలాగోలా పూర్తి చేస్తాం. అలాగే.. జీవితంలో కూడా కారంలాంటి కష్టాలు, ఎత్తు పల్లాలు అనేకం వస్తాయి. అవి వచ్చినప్పుడు.. కుంగిపోకుండా ముందుకెళ్లాలి. ఆ సమయంలో పరిస్థితులకు మిమ్మల్ని మీరు అప్పగించుకోకుండా.. వాటిని అనుకూలంగా మార్చుకోండి.
చేదు:చేదు అనేది కొన్నిసార్లు చెడుకు సూచన. కాకర, కషాయం తప్ప.. కొన్ని చేదు పదార్థాలను తినలేం. ఎందుకంటే అవి మనకు చెడును కలిగిస్తాయి కాబట్టి. అలాగే మన జీవితంలోనూ మనకు హాని కలిగించే వాటికి దూరంగా ఉండండి. అవి మనుషులే కావచ్చు. అలవాట్లు, అభిరుచులే కావచ్చు. మరి ఏ ఇతరవైనా కావచ్చు. వ్యక్తి గతంగా నీవు వాటి వల్ల లేదా వారి వల్ల ప్రభావితమైనట్లు, హాని కలుగుతుందని అనిపిస్తే అలాంటివాటికి దూరంగా ఉండటమే మేలు.