Udayagiri ysrcp MLA: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీకి చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఛాతీలో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయనను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చంద్రశేఖర్రెడ్డి గుండె రక్తనాళాల్లో రెండుచోట్ల పూడికలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నెల్లూరులోనే ఉన్న ఆయనను మెరుగైన చికిత్స కోసం చెన్నై ఆస్పత్రికి తరలించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తన ఆరోగ్యం బాగుందని, రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తానని మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అన్నారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు అస్వస్థత.. చెన్నైకి తరలింపు - నెల్లూరు వైఎస్సార్సీపీకి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి
Udayagiri ysrcp MLA: ఏపీలోని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీకి చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. నెల్లూరులో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలిస్తున్నారు.
ఎమ్మెల్యే చంద్రశేఖర్రెడ్డి