Bank Officer Cheated With Fake Gold In East Godavari: ప్రస్తుత కాలంలో డబ్బులు అవసరమైతే బ్యాంకు వైపు కాలు కదుపుతారు. తమ వద్ద ఉన్న ఆస్తులను కానీ బంగారాన్ని తాకట్టు పెట్టి కావలసిన డబ్బు తెచ్చుకుంటారు. కానీ ఆ బ్యాంకు అధికారి చేసిన పనికి బ్యాంకుల వైపు చూడాలంటే భయపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గోల్డ్ అప్రైజర్ చేసిన మోసానికి అందరూ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. తనకు తెలిసిన వారి దగ్గర నుంచి నకిలీ బంగారం తీసుకోని లోన్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ యూకో బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ తాడోజు శ్రీనివాసరావు గత కొంతకాలంగా నమ్మకంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ నమ్మకాన్ని అవకాశం తీసుకున్న తాడోజు శ్రీనివాసరావు కాకినాడ యూకో బ్యాంకులో నకిలీ బంగారు తనఖా పెట్టి 2 కోట్ల 45 లక్షలకు పైగా రుణం కాజేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.