నగరాల్లోని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెన్షియల్ కాలనీల్లో కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక యాప్‌ను యునైటెడ్ ఫెడరేషన్ ఫర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ రూపొందించింది. యూ-ఫెర్వాస్ మొబైల్ యాప్‌ను వర్చువల్ సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా విస్తృతంగా చేపడుతున్న టీకా కార్యక్రమానికి ఇలాంటి వేదికలతో ముందుకు రావడం అభినందనీయమని జయేశ్ రంజన్ అన్నారు.
U-Ferwas app: అపార్ట్మెంట్లలో వ్యాక్సినేషన్ కోసం యూ-ఫెర్వాస్ యాప్ - యూ-ఫెర్వాస్ యాప్‌ను ప్రారంభించిన ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి
అపార్ట్మెంట్లు, కాలనీల్లో కరోనా టీకా కార్యక్రమం కోసం ప్రత్యేక యాప్ రూపొందించారు. యూ-ఫెర్వాస్ పేరుతో తీసుకొచ్చిన యాప్‌ను ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ ప్రారంభించారు. వచ్చే నెల రాష్ట్రానికి సరిపడా టీకాలు వస్తాయని జయేశ్‌రంజన్ వెల్లడించారు.
మే, జూన్ నెలల్లో కరోనా టీకాల కొరత ఉందని.. వచ్చే నెల రాష్ట్రానికి సరిపడా టీకాలు అందుబాటులో ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు వీలుగా భారత్ బయోటెక్ ఈనెల 4 లక్షల డోసులను ఇచ్చేందుకు అంగీకరించిందని జయేశ్ రంజన్ తెలిపారు. 500లకు పైగా గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీ వెల్పేర్ అసోషియేన్లు వ్యాక్సినేషన్ కోసం ఆసక్తిగా ఉన్నాయని యూఎఫ్‌ఆర్‌డబ్ల్యూఏ అధ్యక్షుడు డాక్టర్ చెలికాని రావు, ప్రధాన కార్యదర్శి బీటీ శ్రీనివాసన్ తెలిపారు. యూ-ఫెర్వాస్ యాప్‌లో టీకాతో పాటు వైద్యసదుపాయల వివరాలను అందుబాటులో ఉంచామన్నారు.
ఇదీ చదవండి:'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'
TAGGED:
corona vaccination drive