Typewriting Course Telangana :సాంకేతికతతో ప్రపంచవ్యాప్తంగా.. అన్నిరంగాల్లో పెనుమార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం యువత కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లతో పనులు చక్కబెట్టుకుంటున్నారు. గతంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఉద్యోగానికి దరఖాస్తు, పరీక్షా ఫలితాలు(Exam Results), వివిధ శాఖల మధ్య సమాచార మార్పిడి, ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు తీర్పులు, చట్టసభల్లో కార్యకలాపాల నమోదు అన్నీ టైప్ రైటింగ్ మెషిన్ ద్వారానే జరిగేవి.
Declining of Typing Courses in Hyderabad :ఇప్పుడు క్రమంగా వాటి స్థానాన్ని కంప్యూటర్లు ఆక్రమించాయి. వాటివాడకం సులభంగా ఉండటమే కాకుండా తప్పు జరిగితే సరిచేసే అవకాశం ఉండడంతో ఖర్చు ఎక్కువైనా సంస్థలతో పాటు వ్యక్తులు కంప్యూటర్లనే వినియోగిస్తున్నారు. తద్వారా టైప్ రైటర్లు అంతరించిపోయే దశకు చేరాయి. ప్రభుత్వం నిర్వహించే టైపింగ్ లోయర్, టైపింగ్ హయ్యర్ వంటి పరీక్షలకు టైపింగ్ తప్పనిసరి కావడం వల్ల కొద్దిమంది యువత ఇంకా నేర్చుకుంటోంది.
Typing Practice :ఏ డిగ్రీ చేసినా, పీజీ చేసినా టైపింగ్ స్కిల్ అనేది ఉండాలని విద్యార్థులు భావిస్తున్నారు. కంప్యూటర్(Computer Knowledge) నేర్చుకున్నప్పటికీ.. నేరుగా దానిపై వేగంగా టైపింగ్ చేయాలంటే కష్టమవుతుంది. టైపింగ్ మిషన్ మీద నేర్చుకుంటే వేగంతో పాటు కచ్చితత్వం అనేది వస్తుంది. సాధారణ వ్యక్తులు గంటలో చేసే పనులను.. టైపింగ్ నేర్చుకున్న విద్యార్థులు అరగంటలో చేయగలరని నిర్వాహకులు భావిస్తున్నారు.
"నేటి తరానికి ఉద్యోగంలో టైపింగ్ అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది. ఇంతకముందు డిగ్రీ చదివినవాళ్లు మాత్రమే టైపింగ్ నేర్చుకునేవాళ్లు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్హతలతో సంబంధం లేదు. నాది బీటెక్ పూర్తైంది. కేంద్ర కొలువులను కొట్టేందుకు టైపింగ్ కచ్చితంగా ఉండాల్సిందే.. గతంలో రెండుసార్లు టైపింగ్‌లో ఫెయిల్ అవ్వటంతో జాబ్ పొందలేకపోయాను." సత్య లలిత,టైపింగ్ ట్రైనీ