Two Girls went Missing in Kurnool for Lovers : ఇంటర్ చదువుతున్న రోజుల్లో చిగురించిన స్నేహం ప్రేమకు బాటలు వేసింది. తెలిసీ తెలియని వయస్సులో ఆ అమ్మాయిలు మాయగాళ్ల మాటలు నమ్మి ప్రేమలో పడ్డారు. వారు చెప్పిందే వేదమనుకుని కన్నవారిని వదిలి ఊరు కానీ ఊరు వెళ్లారు. తమను ప్రేమించిన వారే సర్వస్వం అని నమ్మిన ఆ మైనర్ బాలికలు అసలు విషయం తెలియడంతో తాము మోసపోయామని తెలుసుకున్నారు. పోలీసుల రంగప్రవేశంతో ఆ అమ్మాయిలు ఊపిరిపీల్చుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్నూలు తాలుకా పీఎస్ పరిధిలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు బాలికలకు కళాశాలకు వెళ్తున్న క్రమంలో లారీ క్లీనర్ బి.సురేష్, అతడి స్నేహితుడితో పరిచయం ఏర్పడింది. అలా రోజు మాటలు కలుపుతూ వారితో చనువుగా మాట్లాడుతున్నారు. కొద్ది రోజులకు ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారి మాయమాటలతో ఇద్దరు బాలికలను ఎలాగో అలా తమ బుట్టలో పడేసుకున్నారు. లోకజ్ఞానం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న ఆ బాలికలు ఆ మోసగాళ్లను అమాయకంగా నమ్మారు.
రెండు రోజుల కిందట కళాశాలకు వెళ్లిన వారు అటునుంచి అటే వారితో వెళ్లిపోయారు. ఆ యువకులను నమ్మి వెళ్లిన ఇద్దరు బాలికలను ఓ లాడ్జిలో నిర్భంధించారు. అనంతరం వారిలో ఒకడైన లారీ క్లీనర్ బి.సురేష్ ఓ బాలిక సెల్ఫోన్ తీసుకుని కృష్ణపట్నం పోర్టుకు బయలుదేరాడు. ఈ క్రమంలో రాత్రి అయినా తమ బిడ్డలు ఇంటికి రాకపోవడంతో బాలికల తల్లిదండ్రులు కళాశాల చుట్టూ పక్క ప్రాంతాలలో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.