ద్విచక్ర వాహనం వెనుక సీట్లో కూర్చొని ప్రయాణించే ప్రతి వ్యక్తి తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్న కొత్త నిబంధనను తొలగించాలని తెలంగాణ టూ వీలర్ రైడర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. దీనికి నిరసనగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బహిష్కరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో 'హెల్మెట్ రాజ్ నహీ చెలేగా... షరాబ్ హటావో - తెలంగాణ బచావో' అనే నినాదంతో... 'చావో రేవో' ఉద్యమాన్ని చేపడతామని అసోసియేషన్ కన్వీనర్ మహ్మద్ అమానుల్లా ఖాన్ హెచ్చరించారు.
"తెలంగాణ ఆవిర్భావ వేడుకలు బహిష్కరించాలి"
హెల్మెట్ చట్టం తప్పుల తడకగా ఉందని... వెంటనే రద్దు చేయాలని తెలంగాణ టూ వీలర్ రైడర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. శాసనసభ సమావేశాల్లో హెల్మెట్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం లేదా... ఆప్షనల్‌గా తీర్మానించి సవరించాలని విజ్ఞప్తి చేశారు.
"తెలంగాణ ఆవిర్భావ వేడుకలు బహిష్కరించాలి"