వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు చరవాణిలు, లాప్టాప్, కెమెరా స్వాధీనం చేసుకున్నారు.
చోరగాళ్ల చేతికి బేడీలు - hyderabad crime news
చరవాణిలు, ద్విచక్ర వాహనాలు లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
షేక్ ఉస్మాన్, మహ్మద్ సోహెల్లు గతంలో రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. వీరిపై లంగర్ హౌజ్, రాజేందర్ నగర్, గోల్గొండ ఠాణాల పరిధిలోని పలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నట్లు తెలిపారు.