హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లో కరోనా కలకలం రేగింది. కార్యాలయంలో పనిచేసే ఇద్దరు కొవిడ్ బారిన పడినట్లు నిర్ధరణ అయింది. అప్రమత్తమైన మిగిలిన సిబ్బంది.. పార్టీ కార్యాలయాన్ని శానిటైజేషన్ చేశారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ - telangana latest news
భాజపా రాష్ట్ర కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. అక్కడ పనిచేసే ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇవాళే ఈ భవనంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది.
![భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ two tested corona positive in telangana bjp office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11305350-368-11305350-1617720828201.jpg)
భాజపా రాష్ట్రకార్యాలయంలో కరోనా కలకలం
నిత్యం వివిధ పార్టీ కార్యక్రమాలకు వేదికైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లో కరోనా కలకలంతో పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇవాళ ఈ కార్యాలయంలోనే రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యహహారాల బాధ్యుడు తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సహా కీలక నేతలు హాజరయ్యారు.
ఇవీచూడండి:సీఎస్ సోమేశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్