హైదరాబాద్ మలక్‌పేట దిల్‌సుక్‌నగర్ ప్రధాన రహదారిపై తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బస్టాప్‌లో ఆగి ఉన్న బస్సును మరో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. వణికిన ప్రయాణికులు - రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. హడలిపోయిన ప్రయాణికులు
ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటం వల్ల తాత్కాలిక డ్రైవర్లతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. వారి అవస్థలు వర్ణనాతీతం. నగరంలో మలక్‌పేట వద్ద బస్టాప్‌లో ఆగి ఉన్న బస్సును మరో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్పగాయలయ్యాయి.
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. హడలిపోయిన ప్రయాణికులు
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు అదుపు తప్పి ముందున్న బస్సును ఢీకొట్టిందని ప్రయాణికులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ