వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కొన్ని రోజులుగా కనిపించడం లేదంటూ ఇరు కుటుంబాల సభ్యులు చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నామాలగుండులోని బీదర్బస్తీకి చెందిన యాకన్న అనే వ్యక్తి టైలరింగ్ పీస్ వర్కర్‌గా పని చేసేవాడు. ఆర్థిక సమస్యలతో గత నెల 31న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు, స్నేహితులను ఆరా తీసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో అవినాష్ అనే వ్యక్తి మద్యానికి బానిసై, తరచూ ఇంట్లో గొడవలు పడుతుండేవాడు. ఈ నెల 1న బయటకు వెళ్లి వస్తానని చెప్పిన అవినాష్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇద్దరు వ్యక్తులు అదృశ్యం... - ఇద్దరు వ్యక్తులు
వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు వ్యక్తులు అదృశ్యం...