Two Persons Arrested Supplying Drugs In Hyderabad : రాష్ట్రంలో రోజురోజుకూ మత్తు పదార్థాల(Drugs) విక్రయాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత కట్టడి చేసినా.. వారి సరఫరా మాత్రం ఆగడం లేదు. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా.. గ్రూపులుగా ఏర్పడి యువతనే టార్గెట్ చేస్తూ కోట్లలో బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు వీరి కన్ను జిమ్(GYM) సెంటర్లపై పడింది. ఎందుకంటే ఎక్కువ మంది యువత కండలు తిరిగిన బాడీ కోసం జిమ్‌లకు వస్తుంటారు. వీరిలో కొందరు తక్కువ సమయంలో సిక్స్ ప్యాక్, బాడీ షేప్ మారిపోవాలని తహతహలాడుతూ.. నిషేధిత ఉత్ప్రేరికాలను ఉపయోగిస్తుంటారు.
ఇలాంటి వారినే ఎరగా భావిస్తూ.. డ్రగ్స్ ముఠా సభ్యులు ఇంజెక్షన్లు, ట్యాబెట్లను వారి ఇస్తున్నారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలానే ఇద్దరుడ్రగ్స్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు అయ్యారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.10 లక్షలు(10 Lakh Rupees) విలువ చేసే నిషేధిత వస్తువులను, సెల్‌ఫోన్, జిమ్ విజిటింగ్ కార్డ్స్‌ను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబరాబాద్ కమిషనరేట్ కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో.. నిషేధిత ఉత్ప్రేరికాలైన ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను విక్రయిస్తున్నారనే సమాచారం అందింది. దీంతో కొల్లూరు పోలీసులు, యాంటీ డ్రగ్ స్క్వాడ్, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా నిఘా పెట్టారు. బాడీ బిల్డింగ్ పెంచేందుకు అవసరమైన నిషేధిత ఉత్ప్రేరికాలను సప్లై చేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. బాడీ బిల్డింగ్ కోసం వీటిని హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన జిమ్ నిర్వాహకుడు అహ్మద్ బీన్ అబ్దుల్ ఖాదర్ వీటిని విక్రయిస్తున్నాడు.