హైదరాబాద్ బోయిన్పల్లి, నేరేడ్మెట్ ప్రాంతాలకు చెందిన రాజేష్, నాగేష్, దీపక్ అనే ముగ్గురు కలిసి ఆన్లైన్లో జూదం నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారిలో దీపక్ పరారీలో ఉన్నట్లు సమాచారం. జూదం ఒక్కటే కాకుండా అన్ని రకాల ఆటలకు సంబంధించి బెట్టింగ్ నిర్వహిస్తూ సొమ్ము చేసుకునే వారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మూడు లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు - ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిసింది. నిందితుల నుంచి మూడు లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు
కొత్త వెబ్సైట్లను సృష్టించి వాటి ద్వారా ప్రజలను ఆహ్వానించి బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు. పందెం కాసిన వారు తీవ్రంగా నష్టపోవడం వల్ల వీరు లాభాలు పొందుతున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి :రాష్ట్ర వ్యాప్తంగా 35,308 కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులు