మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్‌పేటలో విషాదఘటన చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై పిల్లాడిని పాఠశాలకు తీసుకువెళ్తున్న సమయంలో స్కూల్ బస్సు ఢీకొనడంతో ఎల్కేజీ విద్యార్థి, అతడిని తీసుకెళ్తున్న మేనమామ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న మీర్పేట్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యాదయ్య తెలిపారు.
స్కూల్ బస్సు ఢీకొని ఇద్దరి మృతి - died
హైదరాబాద్ బడంగ్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో బైక్‌పై వెళ్తున్న ఎల్కేజీ విద్యార్థి అతడిని తీసుకెళ్తున్న మేనమామ అక్కడికక్కడే మృతి చెందారు.
స్కూల్ బస్సు ఢీకొని ఇద్దరి మృతి