Two People Arrested GST Fraud Case in Hyderabad :హైదరాబాద్ కేంద్రంగా రెండు రోజులుగా వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలు నిర్వహిస్తుంది. ఇప్పటికే పన్నులు ఎగవేసిన సంస్థలను గుర్తించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే జీఎస్టీ ఎగవేత కేసులో కావ్య మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రాజ్‌కుమార్ రెఖ్యా రూప్సింగ్ నాయక్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి తెలిపారు.
Kavya Mining Infrastructures Private Limited MD Arrested :2021లో సరూర్‌నగర్ సర్కిల్ పరిధి చంపాపేట్‌లో ఈ మైనింగ్ సంస్థను రూప్సింగ్ నాయక్ ఏర్పాటు చేసి జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి (Commercial Taxes Department) తెలిపారు. వ్యాపార లావాదేవీలు చేయకుండానే, బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి మహారాష్ట్ర నాగపూర్ ప్రాంతంలోని పలు సంస్థలకు ఇచ్చారని పేర్కొన్నారు. దాదాపు రూ.వంద కోట్ల టర్నోవర్‌కు సంబంధించిన ఇన్వాయిస్లు ఇచ్చినట్లు శ్రీదేవి వెల్లడించారు.
ఆ సంస్థల్లో ఆడిటింగ్ మర్చిపోయిన వాణిజ్య పన్నుల శాఖ
రూ.18.55 కోట్ల జీఎస్టీ ఎగవేత : ఇందుకు సంబంధించి మొత్తం రూ.18.55 కోట్ల జీఎస్టీ ఎగవేతకు (GST Fraud) పాల్పడినట్లు గుర్తించామని టీకే శ్రీదేవి వివరించారు. వ్యాపార లావాదేవీలు చేయకుండానే మైనింగ్ కంపెనీ తరఫున తప్పుడు ఇన్వాయిస్లు జారీ చేసిందని పేర్కొన్నారు. ఆ ఇన్వాయిస్లు, ఐటీసీ క్రెడిట్‌ను ఇతర కంపెనీలకు బదిలీ చేసినట్లు గుర్తించామని అన్నారు. రూప్సింగ్ నాయక్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించారని చెప్పారు. అనంతరం అతడిని అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారని, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు శ్రీదేవి వివరించారు.