ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి ఏలూరు కొవిడ్‌కేర్ సెంటర్ నుంచి ఇద్దరు రోగులు పరారయ్యారు. పరారైన కరోనా రోగులిద్దరూ జిల్లా జైలు ఖైదీలు. వీరిద్దరికీ కరోనా సోకటంతో కారాగారం నుంచి శనివారం కొవిడ్ కేర్ సెంటర్‌కు అధికారులు తరలించారు.
ఏపీలో కరోనా సోకిన ఇద్దరు ఖైదీల పరార్ - ఏలూరులో ఖైదీలు అదృశ్యం వార్తలు
కరోనా సాయంతో ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జైలు నుంచి వారిని అధికారులు కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలించగా తప్పించుకునిపోయారు. ఈ ఘటన ఏపీ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.
ఏపీలో కరోనా సోకిన ఇద్దరు ఖైదీలు పరార్
అదను చూసుకుని కొవిడ్ కేర్ కేంద్రం నుంచి ఖైదీలు పారిపోయారు. వీరివురూ పలు చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. పరారైన దొంగల కోసం ఏలూరు పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండిఃకొవిడ్ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే