తెలంగాణ

telangana

ETV Bharat / state

'పాత్రికేయులను ఫ్రంట్​లైన్ వారియర్లుగా గుర్తించాలి' - తెలంగాణ వార్తలు

కరోనా కాలంలో విశిష్ట సేవలందిస్తున్న పాత్రికేయులను ఫ్రంట్​లైన్ వారియర్లుగా గుర్తించాలని భాజపా నాయకుడు గూడూరు నారాయణరెడ్డి కోరారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. త్వరలో మరిన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆక్సిజన్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్
oxygen, somajiguda press club

By

Published : Jun 13, 2021, 10:17 AM IST

కరోనా మహమ్మారి పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో ముందున్న విలేకరులను ఫ్రంట్​లైన్ వారియర్లుగా గుర్తించాల్సిన అవసరం ఉందని భాజపా నాయకుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్‌లో పాత్రికేయుల కోసం జీఎంఆర్ ఫౌండేషన్ విరాళంగా ఇచ్చిన రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. త్వరలోనే మరిన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు విలేకరులు శ్రమిస్తున్నారని తెలియజేశారు. ఈ క్రమంలో ఎంతో మంది విలేకరులను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో మృతిచెందిన పాత్రికేయుల కుటుంబాలకు త్వరలోనే రూ.3లక్షల చెక్కులను అందించనున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి:Kaveri seeds chief: సాగు చేస్తానంటే నాన్న సంతోషపడ్డారు.!

ABOUT THE AUTHOR

...view details