తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణకు మరో రెండు జాతీయ అవార్డులు - awards to telangana

రాష్ట్రానికి మరో రెండు జాతీయస్థాయి అవార్డులు దక్కాయి. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ గ్రామీణ విభాగంలో ఉత్తమ ప్రతిభ, పనితీరు కనపరిచిన 20 జిల్లాలు అవార్డులకు ఎంపికకాగా.. ఇందులో సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు అవార్డులకు ఎంపికైనట్లు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నెల 19న వర్చువల్ ఈవెంట్ ద్వారా కేంద్రం అవార్డులు ప్రదానం చేయనుంది.

two national awards to telangana in swachh bharat mission
తెలంగాణకు మరో రెండు జాతీయ అవార్డులు

By

Published : Nov 13, 2020, 9:50 PM IST

స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ విభాగంలో తెలంగాణకు రెండు అవార్డులు దక్కాయి. మరోసారి జాతీయ స్థాయిలో సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు అవార్డులకు ఎంపికైనట్లు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు కేంద్ర జల్‌శక్తి శాఖ నుంచి లేఖ అందింది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ గ్రామీణ విభాగంలో ఉత్తమ ప్రతిభ, పనితీరు కనపరిచిన 20 జిల్లాలు అవార్డులకు ఎంపికకాగా.. ఇందులో రాష్ట్రానికి చెంది రెండు ఎంపికయ్యాయి. ప్రపంచ టాయిలెట్స్‌డే సందర్భంగా ఈ నెల 19న వర్చువల్ ఈవెంట్ ద్వారా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేయనుంది. రెండు జిల్లాల అధికారులను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందనలు తెలియచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్లనే పురస్కారాలు వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు. అవార్డులు ప్రకటించిన కేంద్రానికి మంత్రి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలియచేశారు.

ఇప్పటికే స్వచ్ఛభారత్, మంచినీటి సరఫరా, మిషన్ భగీరథ, పచ్చదనం, పారిశుద్ధ్యం తదితర విభాగాల్లో ఉత్తమ అవార్డులు వచ్చాయి. ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్‌లు, ఉత్తమ మండల పరిషత్‌లు, ఉత్తమ గ్రామ పంచాయతీ విభాగాల్లో అనేక అవార్డులు సొంతం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి రెండు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ నెల 19వ తేదీన జరగనున్న వర్చువల్ ఈవెంట్ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను ప్రధానం చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి మంత్రి, రాష్ట్ర స్థాయి అధికారులు, అవార్డులు వచ్చిన జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొనాలని కేంద్ర జలశక్తి శాఖ ఆ లేఖలో స్పష్టం చేసింది.

ఇవీ చూడండి: పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?

ABOUT THE AUTHOR

...view details