తెలంగాణ

telangana

ETV Bharat / state

నా భార్యను చంపేశా.. ప్రియురాలిని లేపేశా.. - అనంతపురంలో అక్రమ సంబంధంతో భర్యను చంపిన భర్త

ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య.. ప్రియురాలి కోసం భార్యను చంపిన భర్త.. రోజూ.. ఏదో.. ఒక చోట వింటూనే ఉన్నాం.. వార్తలు చదువుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు చెప్పే.. హత్య కేసులో మాత్రం.. తీగ లాగితే.. అసలు విషయం బయటపడింది.

వివాహేతర సంబంధం: రెండు హత్యలూ.. ఒక ట్విస్ట్
వివాహేతర సంబంధం: రెండు హత్యలూ.. ఒక ట్విస్ట్

By

Published : Jun 2, 2020, 12:30 PM IST

ప్రియురాలిపై మోజుతో.. ఒకప్పుడు భార్యను చంపేశాడు. ఇప్పుడు.. ఎవరి కోసమైతే.. అర్ధాంగిని కాదనుకున్నాడో.. ఆమెనే.. హతమార్చాడు. పోలీసులు విచారణలో.. అసలు విషయాలన్నీ చెప్పేశాడు. భార్యను.. ప్రియురాలిని.. చంపేసి.. కటకటలా పాలయ్యాడు.

ఏపీలో అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని పత్తికుంట గ్రామానికి చెందిన ఉప్పర రామాంజనేయులుకు.. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. అయితే రామాంజనేయులు.. మార్చి 24న పట్టుకుంటపల్లిలో తనతో వివాహేతర సంబంధం ఉన్న మహిళనే బండరాయితో తలపై కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని హిందూపురం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. అక్కడి నుంచి.. కుటుంబ సభ్యులు బెంగళూరు తీసుకెళ్తుండగా.. మార్చి 25న బాధితురాలు మృతి చెందింది.

అప్పటికే పోలీసులు.. రామాంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. విచారణ మెుదలుపెట్టగా.. నమ్మలేని నిజాలు బయటికొచ్చాయి. నాలుగేళ్ల క్రితం విషయాలు బయటపెడితే.. పోలీసులే అవాక్కయ్యారు. ఉప్పర రామాంజనేయులుకు.. ఓ మహిళకు నాలుగేళ్ల క్రితం నుంచే.. వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయం భార్య.. మారక్కకు తెలిసి.. నిలదీసింది. ఆ సమయంలోనే.. తన ప్రియురాలి(రామాంజనేయులు చేతిలో చనిపోయిన మహిళ) సాయంతోనే.. భార్యను చంపేశాడు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా.. ఇంట్లోనే పూడ్చి పెట్టాడు. తర్వాత.. వివాహేతర సంబంధం కొనసాగించాడు. నాలుగేళ్ల కిందటే.. తన తల్లి కనిపించడం లేదని.. మారక్క కుమారుడు సోమందేపల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. తన తండ్రి రామాంజనేయులుపై అనుమానం ఉందని చెప్పాడు.

భార్య గొడవ లేదనుకుంటూ.. ఉన్న రామాంజనేయులును ఈ మధ్య తన ప్రియురాలు పట్టించుకోలేదు. తన పిల్లలు పెద్దవారవుతున్నారని.. కొంతకాలంగా.. దూరం పెట్టింది. ఈ కారణంగా ఆమెపై.. రామాంజనేయులు కోపం పెంచుకున్నాడు. 'నీ కోసం నా భార్యనే చంపేశా. నా మాట వినకపోతే.. నిన్నూ.. చంపేస్తా'నని బెదిరించాడు. మార్చి 24న ప్రియురాలి తలపై బండతో కొట్టి హతమార్చాడు. ఈ మేరకు పోలీసుల విచారణలో రామాంజనేయులు తెలిపాడు. రెండు హత్యలూ చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ శ్రీహరి వెల్లడించారు.

ఇవీ చూడండి:పోరాటాల తెలంగాణలో సంస్కరణల పాలన

ABOUT THE AUTHOR

...view details