హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నాయి. నియోజకవర్గంలోని బోలక్‌పూర్, కవాడిగూడ, గాంధీనగర్, అడిక్మెట్, ముషీరాబాద్, రాంనగర్, డివిజన్‌లోని అనేక ప్రాంతాల్లో కరోనా బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 556కు చేరుకుంది.
ముషీరాబాద్ నియోజకవర్గంలో ధోబి గల్లి మాత్రమే కంటైన్‌మెంట్ జోన్ ఉండగా, కరోనా బాధితుల సంఖ్య పెరగడంతో మరో రెండు కంటైన్‌మెంట్ జోన్లను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. దోమలగూడాలోని ఉందాబాద్, బీమా మైదాన్ ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించి ప్రత్యేక పర్యవేక్షిస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లో రోజుకు రెండుసార్లు శానిటైజ్ చేయడం, కరోనా బాధితులకు ఆరోగ్య విషయంలో సంప్రదింపులు జరిపి వారికి అవసరమైన వైద్య సహాయసహకారాలు అందిస్తున్నట్లు జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఉప కమిషనర్ ఉమా ప్రకాష్, ఏఎంహెచ్ఓ హేమలత తెలిపారు. ఉందాబాగ్‌లో ఎనిమిది మంది, బీమా మైదాన్ ప్రాంతంలో పదిమంది ధోబి గల్లిలో 21 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.
కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్న కరోనా బాధితుల్లో కొందరు నగరంలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని మరి కొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారని అధికారులు వివరించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో బుధవారం 30 కొత్త కేసులు నమోదయ్యాయని, ఓ వ్యక్తి మృతి చెందగా ఐదుగురు డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 25 మంది మృతి చెందగా, 135 మంది డిశ్చార్జ్ కాగా, 396 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు.
ఇదీ చదవండి :పద్మారావుకు కరోనాపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు