తెలంగాణ

telangana

ETV Bharat / state

చిక్కడపల్లి కిడ్నాప్​ కేసులో మరో ఇద్దరి అరెస్టు - చిక్కడపల్లి కిడ్నాప్​ కేసులో మరో ఇద్దరు అరెస్టు

హైదరాబాద్​ చిక్కడపల్లిలో వ్యాపారవేత్త గజేంద్ర పరీక్​ కిడ్నాప్​ కేసులో తాజాగా మరో ఇద్దరిని మధ్య మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద 50లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

చిక్కడపల్లి కిడ్నాప్​ కేసులో మరో ఇద్దరు అరెస్టు

By

Published : Aug 13, 2019, 9:26 AM IST

సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త గజేంద్ర పరీక్​ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను మధ్య మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ఒమర్​ అలీతో పాటు సయ్యద్​ సల్మాన్​, మిరాజ్​ అజహర్​ అలీని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 50 లక్షల 48వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 5 సెల్​ఫోన్లు​ స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్​ తరలించారు. గత నెల 28న రాత్రి దోమలగూడ ప్రాంతంలో వ్యాపారి గజేంద్రను కిడ్నాప్​ చేసి కోటి రూపాయలతో ఉడాయించారు. ఆ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు... తాజాగా మరో ఇద్దరిని పట్టుకున్నారు. నిందితులను చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు.

చిక్కడపల్లి కిడ్నాప్​ కేసులో మరో ఇద్దరి అరెస్టు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details