ఈనెల 4న హైదరాబాద్ పాతబస్తీ బాబా నగర్ సమీపంలోని గుల్షన్ ఇక్బాల్ కాలనీలోని మీ సేవ వద్ద ప్రజలు భారీగా గుమిగూడడంతో చాంద్రాయణ గుట్ట కానిస్టేబుల్ ప్రవీణ్ విధులు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో అమీనుద్దీన్ అనే యువకుడు తల్లితో వచ్చి దౌర్జన్యం చేస్తూ ముందు లైన్లోకి వెళ్లాడు. అది గమనించిన ప్రవీణ్ అతన్ని క్యూ నుంచి పంపించి వేశాడు.
కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితులు అరెస్ట్ - కానిస్టేబుల్‌పై దాడి
విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసి పారిపోయిన ఇద్దరు నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
![కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితులు అరెస్ట్ two-members-arrest-for-attack-on-constable-at-pathabasthi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6714292-thumbnail-3x2-cons.jpg)
కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితులు అరెస్ట్
పగ పెంచుకున్న అమీనుద్దీన్, షేక్ సైఫుద్దీన్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వచ్చి రాడ్‌తో కానిస్టేబుల్‌పై దాడి చేసి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. పారిపోయిన నిందితులను పోలీసుల ఇవాళ అరెస్టు చేసి... రిమాండుకు తరలించినట్లు చాంద్రాయణగుట్ట సీఐ రుద్ర భాస్కర్ తెలిపారు.