Two IAS Officers Dance: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఇద్దరు ఐఏఎస్లు చేసిన డ్యాన్సులు వైరల్గా మారాయి. వృత్తి రిత్యా ఎప్పుడు బిజీబీజీగా గడిపే ఆ అధికారులు కాలేజీ రోజులు గుర్తు చేసుకొని స్టెప్పులతో అదరగొట్టారు. యువ ఉద్యోగులు ముందుగా డ్యాన్సులు చేయాగా.. వారితో పాటు సబ్ కలెక్టర్ అభిషేక్ కాలు కదిపారు. దీంతో అక్కడే ఉన్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కూడా స్టేజి ఎక్కి స్టెప్పులు వేయడంతో స్టేజి దద్దరిల్లిపోయింది.
పరిపాలనే కాదు..స్టెప్పులు కూడా వేస్తాం.. స్టేజిని దద్దరిల్లించిన ఐఏఎస్లు - Two IAS Officers Dance
Two IAS Officers Dance: ఉద్యోగ రిత్యా ఎప్పుడూ నాయకులు, ప్రజలు, అధికారులతో బిజీబీజీగా గడిపే ఐఏఎస్ అధికారులు ఒక్క సారిగా వారి కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో వారు చేసిన డ్యాన్సులు చూసి అందరూ ఫిదా అయ్యిపోయారు. డ్యాన్సులు కాస్త వైరల్ కావడంతో ఇప్పుడు నెట్ ఇంట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సన్నివేశాలు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగాయి.
Two IAS Officers Dance