తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరానికి భారీ సంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు - oxygen concentrators reached telangana

హైదరాబాద్‌ నగరానికి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు చేరుకున్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకున్న 200 మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ విమానానికి స్వాగతం పలికారు.

ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

By

Published : May 16, 2021, 1:24 PM IST

ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

రాష్ట్రంలో కొవిడ్‌ విజృంభించినా.. ఎదుర్కొనేందుకు ముందస్తుగా పటిష్ఠ చర్యలు తీసుకున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. భాగ్యనగరానికి భారీగా చేరుకున్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల విమానానికి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో పాటు.. గ్రీన్‌ కో సంస్థ ప్రతినిధులతో ఆయన స్వాగతం పలికారు. పచ్చదనం, పరిశుభ్రతతో పాటు.. దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించేలాంటి ప్రాజెక్టులను చేపడుతున్న రెన్యూవబర్ ఎనర్జీ సంస్థ గ్రీన్ కో చైనా నుంచి దిగుమతి చేసుకున్న.. 200 మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల విమానాన్ని మంత్రి పరిశీలించారు.

గ్రీన్ కో సంస్థ సహ వ్యవస్థాపకులు అనిల్ చలమాలసెట్టి, మహేశ్‌ కొల్లితో కలిసి.. విమానంలో కలియ తిరిగారు. కొవిడ్ సమయంలో కాన్సంట్రేటర్లు వైరస్ బాధితుల ప్రాణాలను కాపాడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. చైనా నుంచి మొత్తం 5 కార్గో విమానాల్లో.. వెయ్యి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు దేశానికి రావాల్సి ఉండగా.. అందులో మొదటి కార్గో ఉదయం నగరానికి చేరుకుంది. ఒక్కో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ప్రతి నిమిషానికి.. 10 లీటర్ల ఆక్సిజన్‌ని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ సందర్భంగా కొవిడ్ రోగులకు సహకరిస్తున్న గ్రీన్ కో సంస్థను మంత్రి అభినందించారు.

ఇదీ చూడండి: హైదరాబాద్‌ చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు

ABOUT THE AUTHOR

...view details