తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. కేసీఆర్ ఆమోదముద్ర - అనిల్ కుర్మాచలం

Corporations Chairmans: మరో రెండు కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అనిల్ కుర్మాచలం, రాష్ట్ర రెడ్కో ఛైర్మన్‌గా వై.సతీశ్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Corporations Chairmans
రెండు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

By

Published : Jun 21, 2022, 7:41 PM IST

Corporations Chairmans: రాష్ట్రంలో మరో రెండు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం జరిగింది. మూడేళ్ల కాలానికి రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అనిల్ కుర్మాచలం, రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వై.సతీశ్ రెడ్డిని నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వీరిద్దరూ మూడేళ్ల పాటు బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం సతీష్ రెడ్డి తెరాస సామాజిక మాధ్యమాల విభాగం కన్వీనర్​గా పనిచేస్తున్నారు. అనిల్ కుర్మాచలం తెరాస ఎన్ఆర్ఐ సెల్ లండన్ విభాగం అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details