తెలంగాణ

telangana

ETV Bharat / state

నెల్లూరులో రఫెల్​ విడిభాాగాలు.. భాగస్వామ్యం కానున్న ఏపీ కంపెనీలు! - నెల్లూరులో రఫెల్​ విడిభాాగాలు.. భాగస్వామ్యం కానున్న ఏపీ కంపెనీలు!

డసాల్ట్‌-రఫెల్‌ యుద్ధ విమానాల ప్రాజెక్టులో నెల్లూరు జిల్లాలోని రెండు కంపెనీలు భాగం పంచుకోనున్నాయి. వాటి విభాగాలను ఈ కంపెనీలు అందించనున్నాయి. మేకిన్​ ఇండియా ఆశయాలకు అనుగుణంగా శ్రీ సిటీలోని రెండు పరిశ్రమలు భాగస్వాములుగా వ్యవహరించనున్నట్టు ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు.

two companies in nellore district are part of the Raphael warplanes project
నెల్లూరులో రఫెల్​ విడిభాాగాలు.. భాగస్వామ్యం కానున్న ఏపీ కంపెనీలు!

By

Published : Sep 12, 2020, 2:36 PM IST

మేక్‌ ఇన్‌ ఇండియా ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన డసాల్ట్‌-రఫెల్‌ యుద్ధ విమానాల ప్రాజెక్టులో శ్రీ సిటీలోని రెండు పరిశ్రమలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నట్లు శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక్కడి హంటర్‌ డగ్లస్‌ ఇండియా పరిశ్రమ ద్వారా విమానాలు కొలువుతీరే సర్వీస్‌ హ్యాంగర్‌ మెటల్‌ పైకప్పును ఏర్పాటు చేస్తుండగా, సిద్ధార్థ లాజిస్టిక్‌ పరిశ్రమ తన గిడ్డంగిలో ప్రాజెక్టుకు సంబంధించిన పలు విడిభాగాలను భద్రపరచి సరఫరా చేస్తోంది. హంటర్‌ డగ్లస్‌ పంజాబ్‌లోని అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో రఫెల్‌ ఫైటర్‌ జెట్‌ హ్యాంగర్‌ కోసం ‘లుక్సలోన్‌ 300సి’ లీనియర్‌ మెటల్‌ కప్పును విజయవంతంగా సరఫరా చేసింది. అదేవిధంగా శ్రీ సిటీలోని సిద్ధార్థ లాజిస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డసాల్ట్‌ ఫ్రాన్స్‌కు చెందిన విడి భాగాలను తన గిడ్డంగిలో భద్రపరుస్తోంది. అనేక విదేశీ రక్షణ పరికరాల సరఫరాదారులు తమ ఉత్పత్తి సామగ్రిని ఇక్కడ నిల్వ ఉంచుతున్నారు. ఇప్పటికే వీఆర్వీ ఆసియా పసిఫిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ క్రయోజనిక్‌ ట్యాంకులను తయారుచేసి షార్‌కు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details