సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఉన్న రెండు కేసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. పంజాగుట్ట, సదాశివపేట పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్లో ఆధారాలు లేవని వెల్లడించింది. గతంలో రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారని పంజాగుట్ట పీఎస్లో ఓ కేసు నమోదైంది. అలాగే అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టారని సదాశివపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను విచారణ జరిపిన న్యాయస్థానం వాటిని కొట్టివేసింది.
హెరిటేజ్కేసు ఈనెల 20కి వాయిదా