హైదరాబాద్ నగరంలో ప్రజలు నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ... ప్రమాదాలకు కారణమవుతున్నారు. మంగళవారం రాత్రి నగరంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
జూబ్లీహిల్స్ కూడలి వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన కారు ఢీకొంది. కారు ముందు భాగం దెబ్బతినగా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
నార్సింగ్ పీఎస్ పరిధిలోని అల్కాపూర్లో ఓ కారు బోల్తాపడి నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా... ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపటం, మెరుపు వేగంతో ప్రయాణించడం వల్లే నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
వరుస రోడ్డు ప్రమాదాలు.. నిర్లక్ష్యంగా నడపడమే కారణమా? ఇదీ చదవండిఃకరోనా పంజా: చైనాలో 2 వేలకు చేరిన మృతులు