తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలయంలోనికి ప్రవేశించి గంట మోగించిన ఎలుగుబంటి.. ఎక్కడంటే..! - రొళ్ల మండలం తాజా వార్తలు

Bears In Temple: ఏపీలోని సత్యసాయి జిల్లాలో రాత్రి సమయంలో రెండు ఎలుగుబంట్లు గుడిలోకి ప్రవేశించాయి. రెండు ఎలుగుబంట్లలో ఓ ఎలుగుబంటి ఆలయంలో ఉన్న గంటను మోగించింది. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాలో రికార్డ్​ అయ్యాయి.

Bears In Temple
Bears In Temple

By

Published : Nov 1, 2022, 2:23 PM IST

ఆలయంలోనికి ప్రవేశించి గంట మోగించిన ఎలుగబంటి.. ఇది ఎక్కడంటే..!

Bears In Temple: ఆంధ్రప్రదేశ్​లోని సత్యసాయి జిల్లా రొళ్ల మండలం జీరిగెపల్లి గ్రామంలోని ఆలయంలో ఓ ఎలుగుబంటి గంట మోగించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. రాత్రి 9 గంటల సమయంలో రెండు ఎలుగుబంట్లు ఆలయ ప్రధాన ద్వారం నుంచి లోనికి ప్రవేశించాయి. ఆలయం లోపలికి ప్రవేశించిన ఎలుగుబంట్లలో.. ఒకటి గుడి గంటకు వేలాడుతున్న తాడును నోట్లో కరుచుకొని, ముందు కాళ్లతో లాగి గంటను మోగించింది.

ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటిని చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్లు తరచుగా వస్తుంటాయని, ఇప్పటి వరకు ఎవరికి ఏ హాని తలపెట్టలేదని ఆలయ అర్చకులు అంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details