మద్యం తాగి ఆటో నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు మేడిపల్లి కమాన్ వద్ద డ్రంకన్ డ్రైవ్ చేపట్టారు. ఆటో డ్రైవర్లకు తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగినట్లు నిర్ధరణ కావడం వల్ల ఇద్దరిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఫిర్జాదిగూడకు చెందిన వెంకటయ్యకు 6 రోజులు, రామంతాపూర్‌కు చెందిన గణేష్‌కు 2రోజుల జైలు శిక్ష, 3వేల రూపాయల జరిమానాను కోర్టు విధించింది. ఈమేరకు వారిని ట్రాఫిక్ పోలీసులు చర్లపల్లిలోని సెంట్రల్ జైలుకు తరలించారు.
మద్యం మత్తులో ఆటో నడుపుతున్న ఇద్దరికి జైలు శిక్ష - HYDERABAD UPPAL TRAFFIC POLICE
హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం వారికి జైలు శిక్ష ఖరారు చేసింది.
వెంకటయ్యకు 6 రోజులు,గణేష్‌కు 2రోజుల జైలు శిక్ష, 3వేల రూపాయల జరిమానా : కోర్టు