రాచకొండ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరిని నాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 లక్షల రూపాయల విలువ చేసే 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నాచారం అంబేడ్కర్ నగర్‌కు చెందిన వేముల రాజుతో పాటు ఓ మైనర్ బాలుడు జల్సాలకు అలవాటుపడి ద్విచక్రవాహనాలను దొంగిలించారు. ఒకసారి జైలుకు వెళ్లివచ్చినా తమ పంథాను మార్చుకోకుండా మళ్లీ ద్విచక్ర వాహనాలు దొంగిలించడం మొదలుపెట్టారు. నాచారం, ఉప్పల్ , చైతన్యపురి పీఎస్‌ల పరిధిలో 3 బుల్లెట్ వాహనాలతో పాటు మరో 12 ద్విచక్ర వాహనాలు దొంగిలించారని మల్కాజిగిరి ఏసీపీ సందీప్ తెలిపారు. నాచారం చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బాలుడు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి వాహనాలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ సందీప్ వెల్లడించారు.
ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరి అరెస్టు
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరిని నాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరి అరెస్టు