సామాజిక సేవకులమంటూ ఆసుపత్రి యాజమాన్యం, పోలీసులపై దుర్బాషలాడిన వ్యక్తులపై పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. హైదరాబాద్ యూత్ కరేజ్ సంస్థకు చెందిన సల్మాన్‌ఖాన్ (29), సయ్యద్ అయూబ్ (29)లు ఈ నెల 20న అనారోగ్యంతో ఉన్న ఆ సంస్థ ప్రతినిధి మెహరున్నీసా బేగం(55)ను బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ఆసుపత్రిలో దౌర్జన్యానికి పాల్పడిన ఇద్దరి అరెస్ట్ - పోలీసులతో దుర్భాషలాడిన ఇద్దరు పంజాగుట్టలో అరెస్ట్
కరోనా వైరస్ సోకిన మహిళను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చి ఆమెను ఆసుపత్రిలో చేర్చుకోవాలని హంగామా సృష్టించిన ఇద్దరు యువకులను హైదరాబాద్ పంజాగుట్టు పోలీసులు అరెస్టు చేశారు.
ఆసుపత్రిలో దౌర్జన్యానికి పాల్పడిన ఇద్దరి అరెస్ట్
పడకలు ఖాళీగా లేవని సిబ్బంది చెప్పినా వినకుండా వైద్యులు, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసు సిబ్బందిని దుర్భాషలాడారు. ఆసుపత్రి ప్రతినిధి ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.