తెలంగాణ

telangana

ETV Bharat / state

జంట జలాశయాల్లోకి తగ్గిన వరద.. గేట్లు మూసివేత

హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో అధికారులు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లను మూసేశారు. అయితే హిమాయత్‌సాగర్​ మూడు గేట్ల ద్వారా వెయ్యి క్యూసెక్కులను మూసీలోకి విడుదల చేస్తున్నారు.

gates closed
హిమాయత్‌సాగర్‌ నాలుగు గేట్ల ముసేసిన అధికారులు

By

Published : Jul 26, 2021, 3:33 PM IST

రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జలాశయాల్లోకి వస్తున్న వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. భాగ్యనగరానికి జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి వచ్చే వరద ఉద్ధృతి తగ్గడంతో అధికారులు గేట్లు మూసేశారు. ఉస్మాన్​ సాగర్​ పూర్తిగా మూసివేయగా... హిమాయత్ సాగర్ మూడు గేట్ల ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని మూసీ కాలువలోకి వదులుతున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్​లోకి 850 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. అయితే గరిష్ఠ నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,761.90 అడుగులుగా ఉంది.


ఉస్మాన్ సాగర్​ గేట్లు పూర్తిగా ముసివేత

వరద ఉద్ధృతి పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టగా.. ఉస్మాన్​సాగర్​ జలాశయం గేట్లను అధికారులు పూర్తిగా మూసేశారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,786 అడుగులుగా ఉంది. దీంతో జలమండలి అధికారులు అన్ని గేట్లను ముసేశారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ జలాశయంలోకి 300 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది.

ఇదీ చూడండి:భాగ్యనగరంలో జంట జలాశయాలకు తగ్గిన వరద ఉద్ధృతి

ABOUT THE AUTHOR

...view details