దక్షిణ మధ్య రైల్వే 2019-20 ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ప్రదర్శనతో మరోసారి అభివృద్ధి పథంలో కొనసాగడానికి అధికారులు, సిబ్బంది అసాధారణ సేవలే కారణమని జనరల్ మేనేజర్ గజానన్ మ్యా అన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయం నుంచి 65వ రైల్వే వారోత్సవాలనుద్దేశించి వర్చువల్‌గా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి వ్యక్తిగత అవార్డు, గ్రూప్ అవార్డు, షీల్డ్ బహుమతులను అందజేశారు.
జంట నగరాల రైల్వే డివిజన్లకు మరోసారి అవార్డు - జంట నగరాల రైల్వే డివిజన్లకు అవార్డు
దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది కూడా అత్యుత్తమ ప్రదర్శనతో మరోసారి అభివృద్ధి పథంలో దూసుకెళ్లడానికి అధికారులు, సిబ్బంది కృషే కారణమని జనరల్ మేనేజర్ గజానన్ మ్యా అన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్ నిలయంలో 65వ వారోత్సవాలు నిర్వహించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి అవార్డులు అందజేశారు.

దక్షిణ మధ్య రైల్వే
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లు ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఆ డివిజన్లకు సంయుక్తంగా షీల్డ్‌ను ప్రదానం చేశారు. ఈ అవార్డును సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఆనంద్ భాటియా, హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎన్ఎస్‌ఆర్ ప్రసాద్ అందుకున్నారు.
ఇదీ చదవండి:చల్ల చల్లగా మట్టి కూలర్.. ట్రై చేద్దామా!