తెలంగాణ

telangana

ETV Bharat / state

'టీవీఈయూ డైరీ, క్యాలెండర్​ ఆవిష్కరించిన మంత్రులు' - TVEU Dairy Calender Inauguration

తెలంగాణ విద్యుత్​ శాఖ ప్రధాని మోదీని సైతం వణికిస్తోందని విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్-82 ద్వితీయ డైరీ, క్యాలెండర్​ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో కలిసి ఆయన ఆవిష్కరించారు.

Tveu_Dairy_Inauguration
Tveu_Dairy_Inauguration

By

Published : Feb 12, 2020, 11:26 PM IST

రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను చూసి భారతదేశంలోని ప్రజా వ్యతిరేకులు సైతం భయపడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​ మింట్ కాంపౌండ్​లో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్-82 ద్వితీయ డైరీ, క్యాలెండర్​ను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​తో కలిసి ఆయన ఆవిష్కరించారు.

రెండు మూడు నెలల్లో విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. రెప్పవాలకుండా విద్యుత్ ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు గొప్ప గౌరవంతో బతుకుతున్నారని ఆయన కొనియాడారు.

టీవీఈయూ డైరీ, క్యాలెండర్​ ఆవిష్కరించిన మంత్రులు

ఇదీ చూడండి:మహా అద్భుతం... కాళేశ్వరంతో బీళ్లు సస్యశ్యామలం

ABOUT THE AUTHOR

...view details