ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ... టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్‌లో నమోదైన క్రిమినల్ కేసుల ఆధారంగా.. ఈడీ ఇటీవల ఈసీఐఆర్ నమోదు చేసిందని రవిప్రకాశ్ తెలిపారు. కేసులో తనను నిందితుడిగా చేర్చినందున.. అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏబీసీపీఎల్ వాటాదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై రవిప్రకాశ్‌పై అనేక కేసులు నమోదు చేశారని... ఆయన తరఫు న్యాయవాది వివరించారు. ఆ కేసులపై హైకోర్టు స్టే ఉన్నందున... ఈడీ కేసులో అరెస్టు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు... ఈడీకి నోటీసులు జారీ చేసి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.
ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రవిప్రకాశ్ - Raviprakash filed an earlier petition
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ... టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించారు.
![ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రవిప్రకాశ్ Tv9 ex ceo Raviprakash filed an earlier petition](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7964547-124-7964547-1594325359897.jpg)
ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రవిప్రకాశ్