హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టులో రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్పై ఇవాళ మరోమారు విచారణ జరిగింది. ఐ ల్యాబ్ కేసులో ఇప్పటికే హైకోర్టు స్టే విధించిందని కోర్టుకు రవిప్రకాష్ తరఫు న్యాయవాది వెల్లడించారు. నకిలీ ధ్రువపత్రాల కేసు విషయంలో స్టే ఉన్న కారణంగా తాము కస్టడీ పిటిషన్పై విచారణ చెయలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఆయన తరఫు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్పై వాదనలను కూకట్‌పల్లి కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ వాయిదా - TV9 CEO RAVI PRAKASH Bail petition postponed to Next Friday
నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్పై మరోమారు కూకట్‌పల్లి కోర్టులో విచారణ జరిగింది. రవిప్రకాశ్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయటం వల్ల విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
![రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ వాయిదా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4836802-326-4836802-1571754951285.jpg)
రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ వాయిదా