తెలంగాణ

telangana

ETV Bharat / state

Turmeric Board in Telangana 2023 : మళ్లీ తెరపైకి పసుపు బోర్టు .. ఈసారైనా రైతుల కల నెరవేరుతుందా..?

Turmeric Board in Telangana 2023 : తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు అంశం మరోమారు తెరపైకి వచ్చింది. బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రానున్న ఎన్నికల్లోనూ ప్రాధాన్యాంశంగా మారుతుందన్న అంచనాల నేపథ్యంలో బోర్డు ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోదీ తాజాగా ప్రకటన చేశారు. దీన్ని ఎన్నికల హామీగా బీజేపీయేతర పార్టీలు విమర్శిస్తుండగా.. బోర్డు ఏర్పాటు కల నెరవేరనుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Turmeric Board Issue in Telangana
Turmeric Board Issue

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 9:37 AM IST

Turmeric Board in Telangana 2023 :రాష్ట్రంలో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బోర్డును ఏర్పాటు చేస్తామని మహబూబ్‌నగర్‌ సభలో ప్రధాని మోదీ(PM Modi Sanctioned Turmeric Board) ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. బోర్డు ఏర్పాటు అంశం ఎన్నికల నినాదమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 178 మంది పసుపు రైతులు నామినేషన్లు(Farmers Nominations) వేశారు. బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానంటూ ఆ ఎన్నికల సందర్భంగా అప్పటి నిజామాబాద్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అర్వింద్‌(Dharmapuri Arvind) బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.

PM Narendra Modi SanctionedTurmeric Board Telangana :నిజామాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసింది. పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదని పార్లమెంటులో వెల్లడించింది. దీంతో హామీ నెరవేర్చలేదంటూ ఎంపీ అర్వింద్‌ పర్యటనలను రైతులు, బీజేపీయేతర పార్టీల వారు అడ్డుకున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రాధాన్యాంశంగా మారుతుందన్న అంచనాల నేపథ్యంలో బోర్డు ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) తాజాగా ప్రకటన చేశారు. దీన్ని ఎన్నికల హామీగా బీజేపీయేతర పార్టీలు విమర్శిస్తుండగా.. బోర్డు ఏర్పాటు కల నెరవేరనుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని

రాష్ట్రంలో 1.53 లక్షల ఎకరాల్లో సాగు :పసుపు ప్రపంచ ఉత్పత్తిలో 80 శాతం మన దేశంలోనే జరుగుతోంది. పసుపు పంట ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశమూ భారతే. దేశంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ద్వితియ స్థానంలో ఉంది. 2022-23లో రాష్ట్రంలో 1,53,912 ఎకరాల్లో పసుపు పంట వేయగా.. 3.40 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి అయింది. తెలంగాణలో 20,250 టన్నుల మేరకే వినియోగమవుతుండగా.. మిగిలింది ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్తోంది. పసుపు సాగు(Turmeric Cultivation)లో నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ ప్రాంతం అగ్రస్థానంలో ఉంది. అక్కడ ఏటా 65 వేల ఎకరాల్లో పసుపు పండిస్తున్నారు. నిజామాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాల్లోనూ విస్తారంగా సాగవుతోంది. నాణ్యమైన, భారీ డిమాండ్‌ ఉన్న కర్క్యూమిన్‌ రకం పసుపు(Curcumin Type Turmeric) రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతోంది.

BJP Leaders and Farmers Celebrations on announcement Turmeric Board : పసుపు బోర్డు ప్రకటనతో నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా సంబురాలు

నష్టాల నేపథ్యంలో..:పసుపు సాగుకు ఎకరానికి రూ.1.20 లక్షల పెట్టుబడి అవుతుండగా.. సుమారు 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. బాగా పండితే 25 క్వింటాళ్ల వరకు కూడా వస్తుంది. గత పదేళ్లలో పసుపు సగటు ధర క్వింటాలుకు రూ.4 వేల నుంచి రూ.5 వేలు మాత్రమే పలికుతోంది. ఒకట్రెండుసార్లు అరుదుగా రూ.16 వేల వరకు చేరింది. సుగంధద్రవ్యాల కేటగిరీలో ఉండటంతో కేంద్రం నుంచి కనీస మద్దతు ధర(MSP) లభించడం లేదు. పెట్టుబడి మేరకు ఆదాయం రాకపోవడం, వాతావరణం అనుకూలించకపోవడం, చీడపీడలు తదితర కారణాలతో నష్టపోతుండటంతో.. ఇబ్బందులు ఎదుర్కొని రైతులు సాగు తగ్గిస్తున్నారు.

Turmeric Cultivation Decreased in Telangana :గత పదేళ్లలో రాష్ట్రంలో 69 వేల ఎకరాల మేరకు పసుపు సాగు తగ్గింది. ఈ క్రమంలోనే పంట మార్కెటింగ్‌, ఎగుమతి అవకాశాల పెంపుదల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంటులో బిల్లు(Bill in Parliament)ను ఆమోదించాలి. బోర్డు ద్వారా సాగు అభివృద్ధి, విస్తరణ, కొత్త వంగడాలపై పరిశోధనలు జరుగుతాయి. శుద్ధి యూనిట్లు, గిడ్డంగులు ఏర్పాటు అయ్యేందుకు అవకాశముంటుంది. మార్కెటింగ్‌, రవాణా, ఎగుమతి సౌకర్యాలు అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Farmers Celebrations Over Turmeric Board Telangana : దశాబ్దాల కల నెరవేరిన వేళ.. పసుపు బోర్డు ప్రకటనతో రైతుల సంబురాలు

BRS Leaders Fires on PM Modi : 'తెలంగాణకు ప్రధాని మోదీ కొత్తగా ఇచ్చిందేంటి..?'

ABOUT THE AUTHOR

...view details