ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ప్రవీణ్‌కుమార్ వీఆర్‌ఎస్ తీసుకున్నారని తెరాస ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తెరాసపై విమర్శలు చేస్తున్న ప్రవీణ్‌కుమార్.. ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను ఎందుకు ప్రశ్నించరని అన్నారు.
కమ్యూనిస్ట్, ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి నువ్వు చేసిన కుట్రలు నీకు తెలియవా? నాకు తెలియవా? ఉద్యమాలను అణచివేసిన నువ్వు ఇవాళ రాజ్యాధికారం కోసం ఉద్యమాలు చేస్తానంటే నవ్వుపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్టుగా కనిపిస్తోంది. ఇంకో తీరులా కనిపిస్తలేదు. ప్రభుత్వంలో ఏ కార్యక్రమం జరిగినా... దానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారు. నీలెక్క సొంత డబ్బా కొట్టుకోలే, నీలెక్క స్కూళ్లల్ల ఫొటోలు పెట్టుకోలే. పోరగాళ్లతోటి పాలాభిషేకాలు చేయించుకోలే. ఈ డ్రామాలు మా ముఖ్యమంత్రి ఎప్పుడు చేయలే. అయినా సహించినం. మన జాతికి మంచి జరిగితే చాలని. ఇక్కడ ఒకటే ఒక్క అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నా... వేరే రాష్ట్రాలతో పోల్చిచూసినపుడు పూర్తి స్థాయిలో కాకపోయినా దళితజాతిని బయటకు తీసుకురావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాలుపంచుకున్నాడు. దళితుల కోసం పనిచేయకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉన్నాడు. మోదీ వంచిస్తే కనీసం ఒక్కమాట కూడా అనలేదు. ఏందీ కారణం. ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉండి... ఇష్టమొచ్చినట్లు ప్రమాణాలు చేయిస్తే కేసు పెడతారని భయంతో ఉద్యోగం ఉంటదో ఊడిపోతదో అని భయాందోళనకు గురై జాతి కోసం బయటకొస్తున్న అని కలరింగ్ ఇచ్చాడు. నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం బయటపడి... బహుజన సమాజ్ వాది పార్టీలో చేరినవ్. బీజేపీ తల్లి పార్టీలా ఉంటే... బీఎస్పీ దాని పిల్లపార్టీ.