తెలంగాణలో తెదేపాకు కార్యకర్తల అండ పెట్టని కోట అని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు. ఇందిరాపార్క్ సమీపంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. స్వార్థపరులు మాత్రమే పార్టీ వీడుతున్నారని పేర్కొన్నారు. వెళ్లిపోయిన వారితో తమకేం నష్టంలేదని... భవిష్యత్తులో తెలుగుదేశం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని భరోసా ఇచ్చారు. అందుకోసం ప్రతి ఒక్కరం సమష్టి కృషితో ముందుకెళ్దామని రావుల సూచించారు.
'తెదేపాకు కార్యకర్తల అండే పెట్టని కోట' - తెదేపా సీనియర్ నాయకులు
పార్టీని వీడుతున్న నేతలను చూసి నిరుత్సాహ పడకుండా శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు తెతెదేపా రంగంలోకి దిగింది. సీనియర్ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అధైర్యపడొద్దని.. మళ్లీ బలం పుంజుకుంటామని భరోసా ఇచ్చారు.

తెతెదేపా సీనియర్ నాయకులు