కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చి పేదలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు తెతెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ. కొవిడ్ సోకిన అందరికీ గాంధీలోనే చికిత్స అందిస్తామని చెప్పి... తెరాస ఎమ్మెల్యేలకు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఎన్నిసార్లు కోరినా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు లేవని ముఖ్యమంత్రి అవహేళన చేయడం సరికాదని మండిప్డడారు. ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: ఎల్. రమణ
కరోనా వల్ల తలెత్తిన సమస్యల పరిష్కారానికి ఆచార్య కోదండరాం చేపట్టిన నిరసన దీక్షకు తెతెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: ఎల్. రమణ