శాసనసభ ఎన్నికల్లో ఓటమి కారణాలను సమీక్షించడానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ జిల్లాల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఓటమి తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాల్లో ప్రస్తుతం పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. రాబోయే పార్లమెంట్ సమరంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సర్పంచ్ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థులకు భారీగా ఓట్లు లభించాయని పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మాయావతిపై కేంద్రం చేసిన దాడిని కేసీఆర్ ఖండించకపోవడంలో ఆంతర్యం ఏంటని రావుల ప్రశ్నించారు.