తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రంలో మహిళా రక్షణ గాలిలో దీపంలా మారింది' - సిరిసిల్ల ఘటన

రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని తెలంగాణ తెలుగుదేశం నేతలు ఆక్షేపించారు. అధికార పార్టీ ఎన్నికల హామీలను గాలికి వదిలి వివిధ రాజకీయ పార్టీల నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటుందని తెతెదేపా సీనియర్​ నేత రావుల చంద్రశేఖర్​ రెడ్డి దుయ్యబట్టారు.

TTDP leaders MEET Governor latest news
TTDP leaders MEET Governor latest news

By

Published : Feb 26, 2020, 9:48 PM IST

తెరాస పాలనలో మహిళా రక్షణ గాలిలో దీపంలా మారిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఇవాళ గవర్నర్‌ తమళి సై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నఅఘాయిత్యాలు, రైతాంగ సమస్యలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ నేతృత్వంలో గవర్నర్​ను రాజ్‌భవన్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, రైతుల ఆత్మహత్యలు, పేదలకు భూ పంపిణీ తదితర అంశాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని తెతెదేపా సీనియర్​ నేత రావుల చంద్రశేఖర్​ రెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల ఘటన తర్వాత సైతం ప్రభుత్వంలో ఎలాంటి మార్పుల రాలేదని తెతెదేపా మహిళ విభాగం నేత జోత్స్న ఆక్షేపించారు. తక్షణమే రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసి సిరిసిల్ల ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరినట్లు ఆమె తెలిపారు.

'రాష్ట్రంలో మహిళా రక్షణ గాలిలో దీపంలా మారింది'

ఇవీ చూడండి:'న్యాయ వ్యవస్థలోనూ రిజర్వేషన్లు కల్పించాలి'

ABOUT THE AUTHOR

...view details