ఈవీఎంలపై జాతీయ పార్టీలు సైతం సందేహాలు వ్యక్తం చేశాయని తెతెదేపా సీనియర్ నేత రావుల చంద్ర శేఖర్‌రెడ్డి అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఈవీఎంలలో లోపాల గురించి జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తుంటే కేటీఆర్‌కు వచ్చిన ఇబ్బందేంటని హైదరాబాద్‌లో ప్రశ్నించారు. చంద్రబాబుపై కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఆర్థిక నేరస్థుడైన జగన్‌లో కేటీఆర్‌కు హుందాతనం ఎలా కనిపించిందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఎవరి ప్రవర్తన ఎలా ఉందో ప్రజలకు తెలుసని అన్నారు.
'కేటీఆర్‌కు జగన్‌లో హుందాతనం కనిపించడం విడ్డూరం' - రావుల చంద్ర శేఖర్రెడ్జి
దేశంలో మెజార్టీ పార్టీలు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నాయని తెతెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తమ అధినేత చంద్రబాబుపై కేటీఆర్ విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. కేసీఆర్ డైరెక్షన్లో జగన్ పయనిస్తున్నాడని ఆరోపించారు.
రావుల చంద్ర శేఖర్