ఆర్టీసీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా సమ్మె విరమిస్తున్న కార్మికుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటం సరికాదని తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ విమర్శించారు. రాష్ట్రంలో చివరకు గవర్నర్ను సైతం ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. బయో డైవర్సిటీ పార్కు వద్ద నిర్మించిన వంతెన కేవలం తెరాస అనుయాయులకు ఉపయోగపడేలా నిర్మించారని రమణ ఆరోపించారు. ఇటీవల వంతెనపై నుంచి కారు పడిన ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వం తక్షణం సాయం చేయాలని రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
'తక్షణమే ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి' - TSRTC STRIKE TODAY NEWS
ఎలాంటి ఆంక్షలు లేకుండా తక్షణం ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని తెతెదేపా నేతలు రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
!['తక్షణమే ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి' TTDP demand for 'RTC workers need to be recruited immediately'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5184258-520-5184258-1574776037067.jpg)
TTDP demand for 'RTC workers need to be recruited immediately'
'తక్షణమే ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి'
TAGGED:
TSRTC STRIKE TODAY NEWS