తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రం అనుమతిస్తే ఆనందయ్య మందును అందుబాటులోకి తెస్తాం' - ayurvedhic medicine for corona at krishnapatnam

యావత్ దేశాన్ని ఆకర్షించిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుకు కేంద్రం నుంచి అనుమతి లభిస్తే.. త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తిరుపతి ఆయుర్వేదిక్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కరోనా చికిత్సలో భాగంగా కంటిలో మందు వేసే ప్రక్రియను ఆయుర్వేదం సమ్మతిస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు.

anandayya aurvedic mediscin
అనందయ్య ఆయుర్వేద మందు

By

Published : May 24, 2021, 12:15 AM IST

కరోనాకు మందంటూ ప్రాచుర్యం పొందిన ఆనందయ్య ఆయుర్వేద వైద్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తిరుపతి శ్రీవెంకటేశ్వర ఆయుర్వేద బోధనాసుపత్రి వైద్యులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈఓ జవహర్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం... కృష్ణపట్నంలో పర్యటించిన ఆస్పత్రి బృందం.. ఆదివారం మరోసారి సమావేశమైంది.

మరోసారి వైద్యులతో సమాలోచనలు..

చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో.. తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు సమావేశమయ్యారు. ఆనందయ్య ఔషధ తయారీతో పాటు.. తితిదే తరపున మందును తయారు చేసే దిశగా ఉన్న సాధ్యాసాధ్యాలపై సమాలోచనలు చేశారు.

సుమారు 18 రకాల పదార్థాలు..

ఆనందయ్య ఆయుర్వేద ఔషధంలో ఎలాంటి చెడు ప్రభావాలు కలిగించే పదార్థాలను గుర్తించలేదన్న ఆయుర్వేద వైద్యులు.. 18 రకాల పదార్థాలను ఆనందయ్య వినియోగిస్తున్నట్లు ఎస్వీ ఆయుర్వేదిక్ వైద్యకళాశాల ప్రిన్సిపల్​ డా. మురళీ కృష్ణ తెలిపారు.

అనుమతి రాగానే..

కేంద్ర ఆరోగ్య బృందాల నుంచి ఆనందయ్య ఆయుర్వేదానికి ఆమోదం వచ్చిన వెంటనే ఔషధ తయారీ ప్రక్రియను.. తితిదే ప్రారంభించనున్నట్లు పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఒకవేళ కేంద్రం నుంచి ఆమోదం రాకున్నా.. ఔషధంలో ఎటువంటి దుష్ప్రభావాన్ని కలిగించే పదార్థాలు లేనట్లు తేలితే.. రోగనిరోధక శక్తిని పెంచే ఔషధంగానైనా అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.

ఇప్పటికే రూ.2 కోట్లు విడుదల..

తితిదే ఆధ్వర్యంలో చేపట్టబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రెండు కోట్ల రూపాయల నిధులు విడుదలైనట్లు తెలుస్తోంది.

'కేంద్రం అనుమతిస్తే ఆనందయ్య మందును అందుబాటులోకి తెస్తాం'

ABOUT THE AUTHOR

...view details