తెలంగాణ

telangana

సర్వదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభించిన తితిదే

By

Published : Oct 26, 2020, 8:43 AM IST

Updated : Oct 26, 2020, 8:53 AM IST

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీని తితిదే ఇవాళ పునఃప్రారంభించింది. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్​లో టోకెన్లను జారీ చేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులకు మరుసటి రోజు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

ttd-resumed-issuing-timeslot-tokens-at-tirumala
సర్వదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభించిన తితిదే

సర్వదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభించిన తితిదే

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను తితిదే ఇవాళ పునఃప్రారంభించింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా టికెట్లను జారీ చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తుండటంతో భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చారు. రోజుకు 3 వేల టోకెన్లను తితిదే జారీ చేస్తుంది. లాక్ డౌన్ సడలింపు అనంతరం జూన్ 11న దర్శనాలను ప్రారంభించిన తితిదే సర్వదర్శనం టోకెన్లను జారీ చేసింది.

తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో సెప్టెంబర్ 6న సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. తిరిగి నెలన్నరరోజుల తర్వాత టోకెన్ల జారీ ప్రారంభించింది. దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. సర్వదర్శనానికి సంబంధించి ఒకరోజు ముందుగా టికెట్లను తితిదే జారీ చేస్తుంది.

ఇదీ చదవండి:ఏపీ: శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం

Last Updated : Oct 26, 2020, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details