TTD ALERT WITH RAINS : తిరుమలలో కురుస్తున్న వర్షాలతో (rain in tirumala) తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు. వారం రోజుల క్రితం కురిసిన వర్షాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా... ఘాట్రోడ్లలో ఆంక్షలు(Restriction on tirumala ghat roads) విధించారు. రెండు ఘాట్రోడ్లలో ద్విచక్రవాహనాలను నిలిపివేసిన తితిదే అధికారులు...భక్తులను అప్రమత్తం చేస్తున్నారు.
ఏపీలోని తిరుపతిలో వరద ప్రభావం ఇంకా కొనసాగుతోంది. నగరంలోని పలు కాలనీలు.. ఇంకా వరద ముంపులోనే(Floods continue in Tirupati) ఉన్నాయి. నగర సమీపంలోని పేరూరు, పెరుమాళ్లపల్లి చెరువు నుంచి వరద నీరు రావడంతో.. సరస్వతినగర్, గాయత్రీనగర్, శ్రీకృష్ణనగర్, ఉల్లిపట్టెడలో వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది.