తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్యాణోత్సవం వల్లే అయోధ్య కార్యక్రమం ప్రసారం చేయలేకపోయాం: తితిదే - ttd response on svbc event news

అయోధ్య రామ మందిర శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయకపోవడంపై వస్తున్న విమర్శలపై తితిదే స్పందించింది. ఆ సమయంలో శ్రీవారి కల్యాణోత్సవం ప్రత్యక్షప్రసారం చేయాల్సి ఉన్నందున అయోధ్య కార్యక్రమం ప్రసారం చేయలేకపోయామని ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం అయోధ్య కార్యక్రమాన్ని యానిమేషన్​తో ప్రత్యేక కార్యక్రమంలో ప్రసారం చేశామని పేర్కొంది.

ttd-response-on-ayodhya-event-not-telecasted-in-svbc-channel
కల్యాణోత్సవం వల్లే అయోధ్య కార్యక్రమం ప్రసారం చేయలేకపోయాం: తితిదే

By

Published : Aug 7, 2020, 9:38 AM IST

అయోధ్య రామాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ఛానల్​లో ప్రత్యక్షప్రసారం చేయకపోవడాన్ని విమర్శిస్తూ భాజపా ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేసిన ప్రకటనపై తితిదే స్పందించింది. రామ మందిర భూమి పూజ జరిగిన సమయంలో(12:44 గంటలకు) శ్రీవారి కల్యాణోత్సవం ప్రత్యక్షప్రసారం చేయాల్సి ఉన్నందున శంకుస్థాపన కార్యక్రమం ప్రసారం చేయలేకపోయామని ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 వరకు నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తామని.. ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది భక్తులు వీక్షిస్తుంటారని పేర్కొంది.

రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం మొత్తం రికార్డ్ చేసి యానిమేషన్​తో గురువారం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ఎస్వీబీసీ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసిందని తితిదే తెలిపింది. హిందూ ధర్మ పరిరక్షణకు దేవస్థానం కట్టుబడి ఉందని.. పాలకమండలి ఈ దిశగా అనేక చర్యలు చేపట్టినట్లు ప్రకటనలో వివరించింది.

ఇదీ చూడండి:ఇరుకు గల్లీల్లో జనం రద్దీవల్ల విరుచుకుపడుతున్న కరోనా!

ABOUT THE AUTHOR

...view details